తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మాటల మాంత్రికుడిగా, సినీ తారలు, ప్రేక్షకుల చేత గురూజీ అని ఆప్యాయంగా పిలిపించుకునే దర్శకుడు త్రివిక్రమ్ నేటితో ఇరవై ఏళ్ళ సినీప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు.
ఆయన తొలిసారిగా మెగా ఫోన్ పట్టి డైరెక్ట్ చేసిన "నువ్వే నువ్వే" సినిమా సరిగ్గా ఇదే రోజు ఇరవై ఏళ్ళ క్రితం అంటే అక్టోబర్ 10, 2002 లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.
తరుణ్, శ్రేయా శరణ్ జంటగా నటించిన ఆ సినిమా తదుపరి ఇక, త్రివిక్రమ్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా, హిట్లు, సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్ హిట్లతో దూసుకుపోతున్నాడు.
త్వరలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న డైరెక్టర్ త్రివిక్రమ్ ఇలానే ఎన్నో సంవత్సరాలను ఇండస్ట్రీలో జరుపుకోవాలని, మరెన్నో విజయాలను సొంతం చేసుకోవాలని తెలుగు ప్రేక్షకాభిమానులు కోరుకుంటున్నారు.