నటసింహం నందమూరి బాలకృష్ణగారి పాపులర్ టాక్ షో అన్ స్టాపబుల్ విత్ NBK సీజన్ 2 టాక్ షోకు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ చంద్రబాబునాయుడుగారు చీఫ్ గెస్ట్ గా రాబోతున్నారని ఎప్పటినుండి వార్తలు వస్తున్నాయి.
తాజాగా అన్ స్టాపబుల్ మేకర్స్ ఈ విషయంపై సాలిడ్ క్లారిటీ ఇచ్చారు. అక్టోబర్ 14నుండి ప్రతి శుక్రవారం కొత్త ఎపిసోడ్లతో ఆహా లో స్ట్రీమింగ్ కాబోయే ఈ టాక్ షో ఫస్ట్ ఎపిసోడ్ కు చంద్రబాబునాయుడు గారు చీఫ్ గెస్ట్ గా హాజరు కాబోతున్నట్టు మేకర్స్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు.
మరి, ఈ ఎపిసోడ్ లో వియ్యంకుడికి బాలయ్య ఎలాంటి రంజైన ప్రశ్నలను సంధిస్తారో చూడాలని ఇరు రాష్ట్రాల తెలుగు ప్రేక్షకులు ఎంతో కుతూహలంగా ఎదురు చూస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa