ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కార్తీ "సర్దార్" నుండి ఫస్ట్ లిరికల్ అప్డేట్ ..!!

cinema |  Suryaa Desk  | Published : Mon, Oct 10, 2022, 04:28 PM

కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ, పి. ఎస్. మిత్రన్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా "సర్దార్". రాశి ఖన్నా, రజీషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు చుంకీ పాండే విలన్గా నటిస్తున్నారు.


లక్ష్మణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జి.వి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. లేటెస్ట్ గా ఈ సినిమా నుండి మేకర్స్ బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఇంకాసేపట్లోనే అంటే సాయంత్రం ఐదింటికి ఈ సినిమా నుండి ఫస్ట్ లిరికల్ సాంగ్ "సేనాపతి నేనే" రిలీజ్ కాబోతుందని అధికారికంగా ప్రకటించారు.


ఖైదీ తరవాత మళ్ళి అలాంటి హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు కార్తీ. ఈ సినిమాతోనైనా కార్తీ సాలిడ్ హిట్ కొట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa