కోలీవుడ్ సీనియర్ నటి, నిర్మాత, రాజకీయ నాయకురాలు ఖుష్బూ సుందర్ కు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం గోల్డెన్ వీసాను ప్రకటించింది.
ఈ ప్రకటన గతంలోనే జరిగినా, ఇప్పుడు ఖుష్బూ గోల్డెన్ వీసాను తీసుకుని, ప్రభుత్వానికి కృతజ్ఞతలను తెలిపింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ, ఖుష్బూ థాంక్యూ పోస్ట్ పెట్టింది.
యూఏఈ గోల్డెన్ వీసా పొందిన సినీ సెలెబ్రిటీలలో సోనూసూద్, కాజల్ అగర్వాల్, కమల్ హాసన్, షారుఖ్ ఖాన్, మమ్ముట్టి, మోహన్ లాల్ తదితరులు ఉన్నారు.