పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమా 'హరి హర వీరమల్లు'. ఈ సినిమాకి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజగా ఈ సినిమాకు సంబంధించి ప్రీ షెడ్యూల్ వర్క్ షాప్ ఏర్పాటు చేసింది చిత్ర బృందం.దీనికి సంబంధించి యుద్ధ సన్నివేశాల కోసం శిక్షణ తీసుకుంటున్నా పవన్ కళ్యాణ్ ఫోటో ఇప్పుడు వైరల్‌గా మారింది.ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయినిగా నటిస్తుంది. ఈ సినిమాకి ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అక్టోబర్ రెండో వారం తర్వాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో థియేటర్లో రిలీజ్ కానుంది.