ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డిలే ఐన అన్ స్టాపబుల్ విత్ NBK సెకండ్ సీజన్ టాక్ షో ప్రోమో ...!!

cinema |  Suryaa Desk  | Published : Mon, Oct 10, 2022, 10:55 PM

 ప్రేక్షకులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న అన్ స్టాపబుల్ విత్ NBK సీజన్ 2 టాక్ షో ఈ నెల 14 నుండి ఆహా ఓటిటిలో స్ట్రీమింగ్ కాబోతుందన్నవిషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం, రేపు పదకొండింటికి సెకండ్ సీజన్ యొక్క ఫస్ట్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోను విడుదల చేస్తామని మేకర్స్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు. ఆ వెంటనే కొన్ని అనుకోని సాంకేతిక సమస్యలు ఎదురవ్వడం వల్ల ఎనౌన్స్ చేసిన సమయానికి అంటే రేపు అన్ స్టాపబుల్ విత్ NBK సీజన్ 2 ఫస్ట్ ఎపిసోడ్ ప్రోమోను విడుదల చెయ్యలేకపోతున్నామని , త్వరలోనే ప్రోమో రిలీజ్ డేట్ అండ్ టైం ను ఎనౌన్స్ చేస్తామని ప్రకటించారు.


ఆహా సరికొత్త ప్రకటనతో ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలు తీవ్ర నిరాశను వ్యక్తం చేస్తున్నారు. పోతే, ఈ సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ కు తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు , ఆయన కుమారుడు లోకేష్ గారు చీఫ్ గెస్ట్ లుగా హాజరవనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com