తరుణ్ హీరోగా నటించిన సినిమా `నువ్వే నువ్వే`. ఈ సినిమాకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో శ్రీయ హీరోయినిగా నటించింది. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాతో త్రివిక్రమ్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ సినిమాని స్రవంతి మూవీస్ బ్యానర్ పై స్రవంతి రవికిషోర్ నిర్మించారు. ఈ సినిమా విడుదలై సరిగ్గా ఈ అక్టోబర్ 10కి 20 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సినిమా అక్టోబర్ 10,2002న విడుదలై బ్లాక్ బాస్టర్ విజయం సాధించింది. ఈ సినిమాకి కోటి సంగీతం అందించారు.