అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్న ‘రామ్‌సేతు’ సినిమా ట్రైలర్ మంగళవారం విడుదలైంది. అభిషేక్ శర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా అక్టోబర్ 25న విడుదల కానుంది. తాజాగా విడులైన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. రామ్‌సేతు బ్రిడ్జ్‌ను కాపాడటానికి అక్షయ్‌కుమార్ తన టీంతో కలిసి చేసే సాహసాలు సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ సినిమాలో అక్షయ్‌కుమార్ పురావస్తు పరిశోధకుడిగా కనిపించనున్నాడు. టాలీవుడ్ హీరో సత్యదేవ్ ఓ కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమా హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.