ఈ రోజు ఉదయం పదకొండున్నరకు విడుదల కావాల్సిన అన్ స్టాపబుల్ విత్ NBK సెకండ్ సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ ప్రోమో కొన్ని సాంకేతిక సమస్యలు ఎదురవ్వడం వల్ల ఈ రోజు సాయంత్రం ఐదున్నరకు విడుదల కాబోతుందని మేకర్స్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు.
నటసింహం నందమూరి బాలకృష్ణ గారు హోస్ట్ చేస్తున్న ఈ టాక్ షోకు మొదటి చీఫ్ గెస్ట్ గా తెలుగు దేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు హాజరు కానున్నారు. ఆయన కుమారుడు లోకేష్ కూడా సర్ప్రైజ్ విజిట్ చెయ్యనున్నాడు. పోతే, ఫస్ట్ ఎపిసోడ్ అక్టోబర్ 14 నుండి ఆహా లో స్ట్రీమింగ్ కావడానికి రెడీగా ఉంది.