తెలుగు చిత్ర పరిశ్రమ దిగ్గజ దర్శకుడు, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారు తన 100 వ సినిమాగా ఎంతో ప్రెస్టీజియస్ గా తెరకెక్కించిన మూవీ "గంగోత్రి". ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ సినిమాతోనే చిత్రరంగ ప్రవేశం చేసారు. అలానే ఆ సమయంలో టాప్ హీరోయిన్ స్టేటస్ ను ఎంజాయ్ చేస్తున్న ఆర్తి అగర్వాల్ చెల్లెలు అదితి అగర్వాల్ కూడా ఈ సినిమాతోనే టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.
ప్రస్తుతం అదితి సినిమాలకు దూరంగా అమెరికాలో సెటిల్ అయ్యింది. ఇటీవలే తన ఫస్ట్ కో స్టార్ , ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని కలిసిన అదితి, తాజాగా తన తొలి డైరెక్టర్, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారిని కలిసినట్టు తెలుస్తుంది. ఈ మేరకు అదితి సోషల్ మీడియాలో రాఘవేంద్రరావుతో కలిసి దిగిన ఫోటోను పోస్ట్ చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa