నటసింహం నందమూరి బాలకృష్ణ గారు హోస్ట్ చేసిన తొలి టాక్ షో "అన్ స్టాపబుల్ విత్ NBK" సీజన్ 2 యొక్క టీజర్, ట్రైలర్ విడుదలై, నందమూరి అభిమానులను ఫుల్ ఖుషి చేస్తుంటే, ప్రచారంలోకొచ్చిన మరొక వార్త వారిని మరింత ఎక్జయిటింగ్ కు గురి చేస్తుంది.
అదేంటంటే, ఈ వారంలోనే బాలయ్య నటిస్తున్న 107వ సినిమాకు సంబంధించిన టైటిల్ ను మేకర్స్ రివీల్ చెయ్యబోతున్నారని టాక్. త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుందట.
గోపీచంద్ మలినేని డైరెక్షన్లో పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా, వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa