బాలీవుడ్ దిగ్గజ నటుడు బిగ్ బి అమితాబ్ బచ్చన్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న "ప్రాజెక్ట్ కే" లో ఒక కీలకపాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే కదా.
ఈ రోజు అమితాబ్ పుట్టినరోజు కావడంతో ప్రాజెక్ట్ కే టీం స్పెషల్ పోస్టర్ తో ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలిపింది. ఈ పోస్టర్ లో పిడికిలి బిగించిన ఒక చెయ్యి మాత్రమే ఉంటుంది. అంతేకాక లెజెండ్స్ ఆర్ ఇమ్మోర్టల్ అని రాసి ఉంటుంది. అంటే దీనర్ధం లెజెండ్స్ అనేవాళ్ళు చిరంజీవులు అని.
నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈ పాన్ వరల్డ్ సినిమాలో దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తుండగా, దిశా పటాని మరొక కీలకపాత్రలో నటిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa