ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"ఓరి దేవుడా" నుండి అనిరుద్ పాడిన  'గుండెల్లోనా' వీడియో సాంగ్ విడుదల

cinema |  Suryaa Desk  | Published : Tue, Oct 11, 2022, 05:46 PM

 కొంచెంసేపటి క్రితమే యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన "ఓరి దేవుడా" నుండి గుండెల్లోనా అనే మ్యూజికల్ మెలోడీ వీడియో సాంగ్ విడుదలైంది. కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచంద్రన్ ఆలపించిన ఈ పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యమందించారు. లియోన్ జేమ్స్ సంగీతం అందించారు.


తమిళ మూవీ "ఓహ్ మై కడవులే" కి తెలుగు రీమేక్ గా రూపొందిన ఈ సినిమాలో మిథిలా పాల్కర్ హీరోయిన్ గా నటిస్తుండగా, ఒరిజినల్ మూవీని డైరెక్ట్ చేసిన అశ్వత్ మరిముత్తునే తెలుగు వెర్షన్ ను కూడా డైరెక్ట్ చేసారు.


డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఈ సినిమాకు డైలాగ్స్ రాసారు. పీవీపీ సినిమాస్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్  సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 21వ తేదీన థియేటర్లలో విడుదల కావడానికి సిద్ధమవుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa