నందమూరి కళ్యాణ్ రామ్ "బింబిసార" సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుని ప్రస్తుతం ఆ మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు.
కళ్యాణ్ రామ్ నుండి త్వరలోనే మరొక సినిమా రాబోతుంది. ఆయన పుట్టినరోజు సందర్భంగా మైత్రి సంస్థలో ఒక సినిమాను చెయ్యబోతున్నట్టు అధికారిక ప్రకటన చేసారు.
ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ అంతిమదశలో ఉందని తాజా సమాచారం. రాజేంద్ర రెడ్డి ఈ సినిమాకు దర్శకుడు. ఈ సినిమా కళ్యాణ్ రామ్ కెరీర్ లో 19వది కావడంతో NKR 19 వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్నారు. ఈ సినిమాపై తగినంత సమాచారం ఇంకా అందాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa