టాలీవుడ్ క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ డైరెక్ట్ చెయ్యబోతున్న 21 వ సినిమా "రంగ మార్తాండ". 'మన అమ్మానాన్నల కథ' అనేది శీర్షిక. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా పనిచేస్తున్నారు. కీలక పాత్రల్లో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, హాస్యబ్రహ్మ బ్రహ్మానందం, బహుముఖ నటి రమ్యకృష్ణ నటిస్తున్నారు.
లేట్ లెజెండ్ సిరివెన్నెల సీతారామశాస్త్రి ఆఖరిగా ఈ సినిమాలోని గీతాలకు సాహిత్యమందించారు. హౌస్ ఫుల్ మూవీస్, రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి గారు ఈ సినిమాకు వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నారు.
తాజా సమాచారం ఏంటంటే, ఈ మూవీ డబ్బింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని వినికిడి. ఈ మేరకు ప్రకాష్ రాజ్ తన పాత్రకు డబ్బింది చెప్తున్న కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఎనౌన్స్మెంట్ వీడియోతో ఒక విభిన్నమైన సినిమాగా ప్రేక్షకుల అటెన్షన్ ను గ్రాస్ప్ చేసిన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ విడుదలైతే కానీ, యేతరహా కథతో కృష్ణవంశీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారన్నది క్లారిటీ వచ్చేలా లేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa