ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తండ్రితో మలయాళ రీమేక్ చెయ్యడానికి రెడీ ఐన 'మంచు' హీరో...!!

cinema |  Suryaa Desk  | Published : Wed, Oct 12, 2022, 09:50 AM

ఈ మధ్యకాలంలో భారతీయ సినీ పరిశ్రమలో రీమేక్ ల ట్రెండ్ బాగా నడుస్తుంది.ముఖ్యంగా తెలుగులో ఐతే, మలయాళంలో సూపర్ హిట్ ఐన సినిమాలను వేటిని కూడా వదలకుండా రీమేక్ చేసేస్తున్నారు. పవన్ కళ్యాణ్ భీమ్లానాయక్, చిరంజీవి గాడ్ ఫాదర్, రాజశేఖర్ శేఖర్ ఇవన్నీ కూడా మలయాళ రీమేకులే.


తాజాగా ఈ జాబితాలోకి మరొక హిట్ మూవీ, తెలుగు హీరో జాయిన్ అవ్వనున్నారు. 2019లో విడుదలైన "ఆండ్రాయిడ్ కుంజప్పన్" అనే మలయాళ బ్లాక్ బస్టర్ ను తెలుగులో రీమేక్ చేసేందుకు మంచు విష్ణు ఆ మూవీ రీమేక్ హక్కులను కొనుక్కున్నారు.


రీసెంట్గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో మంచు విష్ణు ఈ విషయమై అధికారిక క్లారిటీ ఇచ్చారు. తన తండ్రి మోహన్ బాబు గారితో ఈ సినిమాను రీమేక్ చేస్తానని కూడా విష్ణు తెలిపారు. తండ్రి కొడుకుల మధ్య రిలేషన్ షిప్ ను సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో అద్భుతంగా చూపించిన ఈ సినిమాలో మోహన్ బాబు తండ్రిగా నటించనున్నారు. మరి, కొడుకు పాత్రను పోషించేది ఏ హీరో అన్నది తెలియాల్సి ఉంది. వచ్చే ఏడాది జనవరి కల్లా ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa