మరో రెండ్రోజుల్లో అంటే అక్టోబర్ 14వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతున్న "బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్" మూవీ టీం ఈ రోజు మా ప్రెసిడెంట్, హీరో, "జిన్నా"భాయ్ మంచు విష్ణు ని కలిశారు. ఈ మేరకు విష్ణు నుండి BFH మూవీ టీం కు బెస్ట్ విషెస్ అందాయి. ఈ మీటింగ్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
విశ్వంత్ హీరోగా నటిస్తున్న ఈ మూవీ పక్కా యూత్ ఫుల్ ఎలిమెంట్స్ తో, ఇంటరెస్టింగ్ ప్రమోషనల్ కంటెంట్ తో ప్రేక్షకుల్లో పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసింది. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అంతటా ఆసక్తి నెలకొంది.
సంతోష్ కంభంపాటి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో మాళవిక సతీషన్ హీరోయిన్ గా నటిస్తుంది. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్, స్వస్తిక సినిమాస్ సంయుక్త బ్యానర్లపై నిరంజన్ రెడ్డి, వేణుమాధవ్ పెద్ది ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa