కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ తొలిసారిగా నటిస్తున్న తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం "ప్రిన్స్". జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ కేవీ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాతో హీరోయిన్ మారియా ర్యాబోషప్క వెండితెరకు పరిచయమవుతుంది.
తాజా సమాచారం ప్రకారం, ప్రిన్స్ మూవీ సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బృందం ఈ సినిమాకు క్లీన్ యూ సెర్టిఫికెట్ ఇచ్చింది. పోతే, ఈ మూవీ లెంగ్త్ 2గంటల 23 నిమిషాలని తెలుస్తుంది.
దీపావళి కానుకగా అక్టోబర్ 21వ తేదీన తెలుగు, తమిళ భాషలలో విడుదల కావడానికి రెడీ అవుతున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందించారు.