నాచురల్ స్టార్ నాని నటించిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ "అంటే సుందరానికి". మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేసారు.
ఈ ఏడాదిలోనే విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డీసెంట్ వసూళ్లను రాబట్టి, ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ గా మంచి రివ్యూలు పొందింది.
అక్టోబర్ 2వ తేదీన సాయంత్రం ఆరింటికి జెమిని టీవీలో మొదటిసారి ప్రీమియర్ ఐన ఈ మూవీకి TRP రేటింగ్ ఎంతొచ్చిందో తెలిస్తే షాక్ అయిపోతారు. 1.88 TRP సాధించిన అంటే సుందరానికి మూవీ నాని అభిమానులను తీవ్రంగా నిరాశపరుస్తుంది.
మలయాళ బ్యూటీ నజ్రియా ఫాహద్ ఈ సినిమాతోనే టాలీవుడ్ కి డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చింది. వివేక్ సాగర్ సంగీతం అందించిన ఈ సినిమాలో నరేష్, నదియా, అనుపమ పరమేశ్వరన్, రోహిణి తదితరులు కీలకపాత్రలు పోషించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa