కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ నుండి రాబోతున్న సరికొత్త చిత్రం "సర్దార్". PS మిత్రన్ డైరెక్షన్లో స్పై యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ మూవీ దీపావళి కానుకగా అక్టోబర్ 21వ తేదీన విడుదల కావడానికి రెడీ అవుతుంది.
విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో మేకర్స్ ట్రైలర్ ను రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధం చేసారు. ఈ మేరకు రేపు సర్దార్ ట్రైలర్ విడుదల కాబోతుందని అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు. కానీ, విడుదల సమయం తెలపలేదు.
రజిషా విజయన్, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ లైలా కీలకపాత్రను పోషిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa