'రాహు' ఫేమ్ అభిరాం వర్మ నటించిన కొత్త చిత్రం "నీతో". ఈ సినిమాకు బాలు శర్మ దర్శకుడు కాగా సాత్వికా రాజ్ హీరోయిన్ గా నటించింది.
వివాహానికి ఇన్సూరెన్స్ అనే విభిన్న కధాంశంతో, మోడరన్ డేస్ లో జరిగే ఒక కాంప్లికేటెడ్ లవ్ స్టోరీ గా తెరకెక్కిన ఈ మూవీ, ఇటీవల విడుదలైన ట్రైలర్ తో ప్రేక్షకుల్లో పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చెయ్యగలిగింది.
మిలియన్ డ్రీమ్స్, పృథ్వి క్రియేషన్స్ సంయుక్త బ్యానర్లపై AVR స్వామి, కీర్తన ఈ చిత్రాన్ని నిర్మించారు. వివేక్ సాగర్ సంగీతం అందించిన ఈ మూవీ రేపు థియేటర్లకు రాబోతుంది. మరి, ఈ మూవీ వెండితెరపై మ్యాజిక్ ను క్రియేట్ చేసి, బాక్సాఫీస్ వద్ద విన్నర్ గా నిలుస్తుందో లేదో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa