ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సందీప్ కిషన్ "మైఖేల్" పై బిగ్ అప్డేట్ రాబోతుందోచ్...!!

cinema |  Suryaa Desk  | Published : Thu, Oct 13, 2022, 06:54 PM

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ తొలిసారి నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం "మైఖేల్". రంజిత్ జయకోడి దర్శకత్వంలో, భరత్ చౌదరి, రామ్మోహన్ రావు, నారాయణదాస్ నారంగ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో దివ్యాన్ష కౌశిక్ హీరోయిన్గా నటిస్తుంది. స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ విలన్గా నటిస్తున్న ఈ మూవీలో విలక్షణ నటుడు విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషిస్తున్నారు. వరుణ్ సందేశ్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు. ఇంతటి ప్రత్యేకతలతో కూడిన ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో ఏక కాలంలో విడుదల కావడానికి రెడీ అవుతుంది.


సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుండి రేపు ఉదయం 11:07 నిమిషాలకు క్రేజీ ఎనౌన్స్మెంట్ రాబోతుందని తెలుపుతూ, మేకర్స్ ప్రకటించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa