నాగ చైతన్య, వెంకట్ ప్రభు కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళంలో కూడా విడుదల కానుంది. ఈ సినిమాలో నటిస్తున్న ప్రధాన నటీనటుల వివరాలను శుక్రవారం చిత్ర బృందం ప్రకటించింది. ఈ సినిమాలో కర్తకదీపం సీరియల్ ఫేమ్ ప్రేమి విశ్వనాథ్ కూడా నటిస్తోంది. ఆమెతో పాటు ప్రియమణి, వెన్నెలకిషోర్, సంపత్ రాజ్ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు.
![]() |
![]() |