ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ధ్రువ' తదుపరి అరవింద్ స్వామి నటించేది ఈ సినిమాలోనే...!!

cinema |  Suryaa Desk  | Published : Fri, Oct 14, 2022, 03:52 PM

తొంభైల నాటి కోలీవుడ్ చాక్లెట్ బాయ్, రొమాంటిక్ హీరో అరవింద్ స్వామి 2016 లో విడుదలైన "ధ్రువ" సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించి, వారి విశేష ఆదరణను దక్కించుకున్నారు. ఇక అప్పటి నుండి అరవింద్ స్వామి ఏ తెలుగు సినిమాలోనూ నటించలేదు.


తాజాగా అరవింద్ స్వామి ఒక తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు డైరెక్షన్లో నాగ చైతన్య హీరోగా నటిస్తున్న సినిమా స్టార్ క్యాస్ట్ కి సంబంధించి ఈ రోజు ఉదయం నుండి అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. 


తాజా గా NC 22 చేసిన ప్రకటన ప్రకారం, ఈ సినిమాలో అరవింద్ స్వామి కీ రోల్ ప్లే చేస్తున్నారు. అలానే ప్రియమణి, శరత్ కుమార్, వెన్నెల కిషోర్ కూడా ఈ సినిమాలో కీలకపాత్రలు పోషించేందుకు రెడీ అయ్యారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa