జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ డైరెక్షన్లో కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్న చిత్రం "ప్రిన్స్". ఈ సినిమాతో మరియా ర్యాబోషప్క హీరోయిన్ గా పరిచయమవుతుంది.
తాజాగా ఈ సినిమా నుండి హూ యామ్ ఐ అనే లిరికల్ సాంగ్ విడుదలైంది. గతంలో విడుదలైన పిలాపి, జెస్సికా పాటలు చార్ట్ బస్టర్లుగా నిలవగా, తాజాగా విడుదలైన ఈ లవ్ బ్రేకప్ సాంగ్ కూడా ఆ లిస్టులోకి చేరేటట్టు కనిపిస్తుంది. ఈ పాటను దినకర్ ఆలపించగా, రామజోగయ్యశాస్త్రి గారు సాహిత్యం అందించారు. శాండీ డాన్స్ స్టెప్స్ కంపోజ్ చేసారు.
ఈ సినిమాను సునీల్ నారంగ్, సురేష్ బాబు, పుస్కూర్ రామ్మోహన్ రావు సంయుక్తంగా నిర్మించారు. తమన్ సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa