బేబీ నేహా ప్రధాన పాత్రలో వేదాంత్ వర్మ మరియు ప్రణీత రెడ్డి బాలనటులుగా నటించిన సినిమా ‘లిల్లీ’. ఈ సినిమాతో శివమ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాలో రాజ్‌వీర్ ప్రధాన పాత్ర పోషించారు. నేడు బేబీ నేహా పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా పోస్టర్ ని ప్రముఖ డైరెక్టర్ హరీష్ శంకర్ రిలీజ్ చేసారు. ఈ సినిమాలో సీనియర్ నటుడు శివ కృష్ణ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా ఫస్ట్ చిల్డ్రన్స్ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కింది. ఈ సినిమా తెలుగు, తమిళ్,కన్నడ, మలయాళం, హిందీ భాషలో త్వరలో రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాని గోపురం స్టూడియోస్ బ్యానర్‌పై కె. బాబురెడ్డి, జి. సతీష్‌కుమార్‌లు నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa