టాలీవుడ్ క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ డైరెక్ట్ చెయ్యబోతున్న 21 వ సినిమా "రంగ మార్తాండ". విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ, హాస్యబ్రహ్మ బ్రహ్మానందం ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు మెగాస్టార్ చిరంజీవి గారు వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారు.
ప్రస్తుతం ఈ మూవీ డబ్బింగ్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ కృష్ణవంశీ ని కలిసిన ప్రకాష్ రాజ్ సినిమా, జీవితం వంటి విభిన్న అంశాలపై మనసువిప్పి మాట్లాడుకున్నారు. ఈ మేరకు వీరు ముచ్చట్లలో మునిగిపోయిన పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
హౌస్ ఫుల్ మూవీస్, రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa