ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'స్వాతిముత్యం' 8 రోజుల AP/TS కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Sat, Oct 15, 2022, 04:02 PM

లక్ష్మణ్ కె కృష్ణ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తమ్ముడు మరియు నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ గణేష్ 'స్వాతిముత్యం' సినిమాతో టాలీవుడ్ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి అందరికి తెలిసిందే. ఈ అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా అక్టోబర్ 5, 2022న దసరా సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 0.70 కోట్లు వసూలు చేసింది.


ఈ చిత్రంలో బెల్లంకొండ గణేష్ సరసన వర్ష బొల్లమ్మ కథానాయికగా కనిపించనుంది.  ఈ సినిమాలో వెన్నెల కిషోర్, రావు రమేష్, సుబ్బరాజు, హర్షవర్ధన్, గోపరాజు రమణ, ప్రగతి తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.


'స్వాతిముత్యం' బాక్స్ఆఫీస్ కలెక్షన్స్ :::::::
నైజాం :  0.18 కోట్లు
సీడెడ్ :  0.08 కోట్లు
UA : 0.11 కోట్లు
ఈస్ట్ :  0.07 కోట్లు
వెస్ట్ :  0.06 కోట్లు
గుంటూరు :  0.09 కోట్లు
కృష్ణా :  0.07 కోట్లు
నెల్లూరు :  0.05 కోట్లు
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 0.70 కోట్లు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa