ఓ క్యాబ్ డ్రైవర్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని మరాఠా నటి, దర్శకురాలు మానవన్‌నాయక్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. శనివారం రాత్రి బాంద్రా కుర్లా కాంప్లెక్స్ నుంచి తన ఇంటికి వెళ్లేందుకు ఉబర్ క్యాబ్ బుక్ చేసుకుంది. క్యాబ్ డ్రైవర్ వేగంగా వెళ్లి తనతో అసభ్యంగా మాట్లాడాడని చెప్పింది. తనను వేరే మార్గంలో తీసుకెళ్తుండగా.. కేకలు వేయడంతో స్థానికులు వెంబడించి రక్షించారని తెలిపింది. నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని పోలీసులు తెలిపారు.