దీపావళి కానుకగా అక్టోబర్ 21వ తేదీన థియేటర్లకు రాబోతున్న సినిమాలలో హీరో, మా ప్రెసిడెంట్ మంచు విష్ణు నటించిన సినిమా "జిన్నా". పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాతో ఇషాన్ సూర్య డైరెక్టర్ గా పరిచయం కాబోతున్నారు.
తాజాగా కొంచెంసేపటి క్రితమే ఈ సినిమా నుండి మాంఛి పార్టీ సాంగ్ విడుదలైంది. 'వాట్ ఏ జోడి... ' అని సాగే ఈ పాటను హర్షవర్ధన్ చావలి, శ్రావణి ఆలపించగా, దివ్య కుమార్ సాహిత్యం అందించారు. అనూప్ రూబెన్స్ స్వరపరిచిన ఈ పాట చార్ట్ బస్టర్ గా నిలిచేలా ఉంది.
ఈ సినిమాను అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa