ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సరోగసిపై సింగర్ చిన్మయి క్లారిటీ

cinema |  Suryaa Desk  | Published : Wed, Oct 19, 2022, 01:58 PM

నయనతార సరోగసి వివాదం తర్వాత చాలా మంది ఈ అంశంపైనే చర్చించుకుంటున్నారు. సింగర్ చిన్మయి, నటుడు రాహుల్‌ దంపతులకు ఆ మధ్య కవలలు జన్మించిన విషయం తెలిసిందే. దీంతో చిన్మయి కూడా సరోగసి ద్వారా తన బిడ్డలకు జన్మనిచ్చారంటూ సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌ జరిగింది. దీనికి సమాధానంగా చిన్మయి తాను గర్భిణిగా ఉన్నప్పుడు తీసుకున్న ఫోటోను పోస్ట్ చేశారు. సరోగసిపై వస్తున్న ప్రశ్నలకు ఈ విధంగా ఆమె సమాధానమిచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa