పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మారుతీ డైరెక్షన్లో ఒక సినిమాను చేస్తున్నారన్న విషయం ఇండస్ట్రీ మొత్తం వైరల్ టాపిక్ గా మారుతున్నా, అటు ప్రభాస్ నుండి కానీ, మేకర్స్ నుండి కానీ ఎలాంటి అధికారిక సమాచారం మాత్రం ఇప్పటివరకు లేదు.
తాజాగా ఈ సినిమా రేపటి నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోబోతుందని టాక్. అలానే బాలీవుడ్ నటుడు బొమన్ ఇరానీ ఈ సినిమాలో ప్రభాస్ కు తాతగా నటించబోతున్నారని వినికిడి.
అత్తారింటికి దారేది సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు తాతగా నటించిన బొమన్ ఇరానీకి ఆ సినిమా చాలా మంచి పేరును తీసుకొచ్చింది కానీ, ఆ తరవాత మరే చెప్పుకోదగ్గ ప్రాజెక్ట్ లలోను బోమన్ నటించలేదు. ఒకవేళ ప్రభాస్ సినిమాలో బోమన్ నటించడం కనక నిజమైతే, అత్తారింటికి దారేది తదుపరి బొమన్ చెయ్యబోయే బిగ్ టాలీవుడ్ ప్రాజెక్ట్ ఇదే అని చెప్పాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa