బాలకృష్ణ హోస్ట్ చేసిన అన్ స్టాపబుల్ సీజన్ 2 టాక్ షో భారీ అంచనాల నడుమ ఈ మధ్యనే ఆహా ఓటిటిలోకి స్ట్రీమింగ్ కొచ్చిన విషయం తెలిసిందే కదా.
ఫస్ట్ ఎపిసోడ్ కు బాలయ్య వియ్యంకుడు, తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు ముఖ్య అతిధిగా విచ్చేసి, పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఆ వెంటనే సెకండ్ ఎపిసోడ్ కి సంబందించిన క్రేజీ ప్రోమోను విడుదల చేసి, ఆడియన్స్ లో మరింత ఆసక్తిని పెంచేశారు ఈ షో మేకర్స్.
అన్ స్టాపబుల్ ఫస్ట్ ఎపిసోడ్ నాలుగే నాలుగు రోజుల్లో 100 మిలియన్ మినిట్స్ ను పూర్తి చేసుకుని, ఏ తెలుగు టాక్ షోకు సాధ్యం కానీ రికార్డును డిజిటల్ రంగంలో ఏర్పరిచి, టాక్ షో కా బాప్ అనిపించుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa