కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ తొలిసారిగా నటిస్తున్న తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం "ప్రిన్స్". తెలుగు డైరెక్టర్ అనుదీప్ ఈ సినిమాకు దర్శకుడు కాగా, మారియా ర్యాబోషప్కా హీరోయిన్ గా నటిస్తుంది.
ఐతే, ఈ సినిమాకు ప్రిన్స్ టైటిల్ పెట్టడానికి గల కారణాన్ని హీరో శివకార్తికేయన్ మీడియాకు వివరించారు. ప్రిన్స్ కథ ఒక బ్రిటిష్ రాజ్యానికి కనెక్ట్ అయ్యి ఉంటుంది... సోషల్ మీడియాలో శివ కార్తికేయన్ ను ఆయన ఫ్యాన్స్ ప్రిన్స్ అని పిలుచుకుంటారు. ఈ రెండు కారణాల చేత ఈ సినిమాకు ప్రిన్స్ అనే టైటిల్ ను పెట్టడం జరిగిందని శివ కార్తికేయన్ తెలిపారు.
దీపావళి కానుకగా అక్టోబర్ 21వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమా ఘనవిజయం సాధించాలని శివకార్తికేయన్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa