యావత్ భారతదేశాన్ని ఉర్రూతలూగించిన RRR సినిమా లేటెస్ట్ గా రేపు జపాన్ దేశంలో విడుదల కావడానికి సిద్ధమవుతుంది. ఈ మేరకు RRR త్రయం నిన్ననే జపాన్ కి చేరుకున్నారు.
తాజాగా ఈ రోజు జపాన్ మీడియాతో ఇంటిరాక్ట్ అయ్యి, RRR సినిమా గురించిన ఆసక్తికర విషయాలను వెల్లడించారు RRR త్రయం రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్. ఇందుకు సంబంధించిన పిక్ ఒకటి సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది.
రాజమౌళి డైరెక్షన్లో జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్, ఆలియాభట్, అజయ్ దేవగణ్, ఒలీవియా మోరిస్, శ్రేయా కీలకపాత్రలు పోషించిన ఈ చిత్రం అత్యధిక కలెక్షన్లు సాధించిన నాల్గవ భారతీయ చిత్రంగా రికార్డు నెలకొల్పింది.