ఆస్కార్ అవార్డు గ్రహీత AR రెహ్మాన్ భారతదేశపు సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి పై ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేసారు. రాజమౌళి డైరెక్ట్ చేసిన మగధీర సినిమా చూసినప్పుడే రాజమౌళి క్యాలిబర్ ఏంటో అర్ధమైంది. బాహుబలి చూసిన తదుపరి మైండ్ బ్లోయింగ్ అనిపించింది. ఆ సినిమా తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఖ్యాతిని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లింది... అంటూ రాజమౌళి పై రెహ్మాన్ ప్రశంసలు కురిపించారు.
ప్రస్తుతం RRR సినిమా ఆస్కార్ బరిలోకి ప్రేక్షకుల హాట్ ఫేవరెట్ గా దిగింది. ఈ నేపథ్యంలో ఆస్కార్ అవార్డు గ్రహీత అయినటువంటి రెహ్మాన్ గారు ఇలాంటి సెన్సేషనల్ కామెంట్స్ చెయ్యడం ఆసక్తిని సంతరించుకుంది.