నటసింహం నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ గోపీచంద్ మలినేని కలయికలో ఒక పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇందులో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా, తమన్ సంగీతం అందిస్తున్నారు.
నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మూవీ టైటిల్ రేపే రివీల్ కానుంది. ఈ మేరకు రేపు కర్నూల్ కొండారెడ్డి బురుజు సెంటర్ వేదికగా గ్రాండ్ టైటిల్ లాంచ్ ఈవెంట్ జరగనుంది. తాజా సమాచారం ప్రకారం, ఈ మూవీ శాటిలైట్ రైట్స్ ను భారీ మొత్తం వెచ్చించి స్టార్ మా ఛానల్ చేజిక్కించుకుందని టాక్.
కన్నడ నటుడు దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్ కీలకపాత్రలు పోషిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa