పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ స్టైలిష్ డాన్ అవతారంలో కనిపించిన చిత్రం "బిల్లా". మెహర్ రమేష్ ఈ సినిమాకు దర్శకుడు. అనుష్క శెట్టి ఫిమేల్ లీడ్ పోషించిన ఈ చిత్రంలో హన్సిక మోత్వానీ, సుబ్బరాజు, నమిత కీ రోల్స్ పోషించారు. లేట్ లెజెండ్ కృష్ణంరాజుగారు ప్రభాస్ తో కలిసి నటించిన తొలి సినిమా ఇది.
అక్టోబర్ 23న అంటే మరో రెండ్రోజుల్లోనే ప్రభాస్ పుట్టినరోజు. ఈ సందర్భంగా బిల్లా 4కే వెర్షన్ ఆల్ ఓవర్ ఇండియా సెలెక్టెడ్ ధియేటర్స్ లో స్పెషల్ స్క్రీనింగ్ కానుంది. అలానే విదేశాల్లోనూ గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ మేరకు యునైటెడ్ స్టేట్స్ లో బిల్లా 4కే వెర్షన్ 70లొకేషన్స్ లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ద్వారా విడుదల కాబోతుంది. దీంతో ఇప్పటివరకు విడుదలైన రీ రిలీజ్ సినిమాలలో బిల్లా సెన్సేషనల్ రికార్డు క్రియేట్ చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa