పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుండి వచ్చిన రీసెంట్ బ్లాక్ బస్టర్ భీమ్లానాయక్. మలయాళ సూపర్ హిట్ అయ్యప్పనం కోషియం కి అఫీషియల్ తెలుగు రీమేక్ గా రూపొందిన ఈ సినిమాకు సాగర్ కే చంద్ర దర్శకుడు.
దగ్గుబాటి రానా విలన్గా నటించిన ఈ సినిమా పవన్ రీఎంట్రీ తదుపరి సాలిడ్ హిట్ ఐన సినిమా. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మించారు.
తాజాగా నాగవంశీ బాలయ్య హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ టాక్ షోలో పాల్గొన్నారు. ఈ షోలో ఆయన భీమ్లానాయక్ కి సంబంధించిన ఒక ఇంటరెస్టింగ్ న్యూస్ ను షేర్ చేసుకున్నారు. భీమ్లానాయక్ హీరోగా ముందుగా బాలకృష్ణ గారిని అనుకున్నామని, కానీ ఈ సినిమా కథ తనకన్నా పవన్ కళ్యాణ్ కైతే పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందని, పవన్ పేరును బాలయ్యే రికమెండ్ చేసారని అసలు విషయం చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa