‘మణికర్ణిక’ ఓ చారిత్రక చిత్రం. భారతదేశ వీరనారి ఝాన్సీరాణి కథ కావడంతో చాలా బాధ్యతగా ఈ సినిమా చేశానని ఆ సినిమా కీలక పాత్రధారి కంగనా రనౌత్ తెలిపారు. మీడియాతో ఆమె మాట్లాడుతూ భారీ ప్రాజెక్ట్ కాబట్టి అందరం శారీరకంగా, మానసికంగా ఎక్కువ కష్టపడ్డాం. హైదరాబాద్, జోధ్‌పూర్‌లలో షూటింగ్ చేసినప్పుడు మూడు, నాలుగుసార్లు గాయాలపాలయ్యాను. ఓ సారి కాలికి ఫ్రాక్చర్ అయింది. కాస్త రెస్ట్ తీసుకుని మళ్లీ సెట్‌లోకి వెళ్లిపోయేదాన్ని. దర్శకుడు క్రిష్ ‘యన్.టి.ఆర్’ సినిమాతో బిజీ కావడంతో సినిమాలో కొంత భాగం నేను డైరెక్ట్ చెయ్యాల్సి వచ్చింది. డైరెక్షన్ చెయ్యగలననే నమ్మకం నాకున్నా నాతో ఉన్నవారి మాటల వల్ల నేను సాధించగలనా, లేదా అన్న అనుమానం కలిగింది. అయినా అధైర్యపడలేదు. చిత్రీకరణ దశలో ఎంత నెగిటివ్ ఉందో ట్రైలర్ రిలీజ్ అయ్యాక అంతా పాజిటివ్ అయింది. ఏ భాషలో రీమేక్ చేసినా ప్రజలు ఈ సినిమాను ఆదరిస్తారు. సినిమాలకు భాషల హద్దులు ఉండకూడదని కంగనా పేర్కొంది
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa