ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాజ‌ల్‌కు అనూహ్యంగా వ‌స్తున్న‌ ఆఫ‌ర్లు

cinema |  Suryaa Desk  | Published : Sun, Dec 23, 2018, 03:05 PM

హీరోయిన్ కాజల్ కెరీర్ ఎండింగ్‌కు వచ్చిందని అంద‌రూ భావిస్తున్న తరుణంలో ఆమెకు అనూహ్యంగా భారీ చిత్రాల్లో ఆఫర్లు ద‌క్కాయి.  అవకాశాలు కష్టమే అనుకుంటున్న టైంలో భారీ ఆఫర్ రావడం.. మళ్లీ కొంత కాలం స్టార్‌డంతో దూసుకుపోడవం కాజ‌ల్ విష‌యంలో జరుగుతుంది. స్టార్ హీరోలతో అవకాశాలు పెద్దగా లేకపోవడంతో చిన్న హీరోలతో వరుసగా చిత్రాలుచేస్తూ వచ్చింది ఆమధ్య కమల్‌హాసన్‌తో ఒక చిత్రం చేయబోతున్నట్లుగా సగం క్లారిటీ ఇచ్చిన కాజల్ ‘ఇండియన్ 2’ గురించి ఫుల్ క్లారిటీ ఇచ్చింది.


‘ఇండియన్ 2’ కోసం ఈమె కళరియపట్టు అనే కళ నేర్చుకుంటుందన్నది పాత మాటే. అయతే, ఆ కళలో ఇప్పుడు ఆరితేరిందట. కళకు సంబంధించిన పుస్తకానూ చదువుతుందన్నది టాక్. తాజాగా ఆ కళకు సంబంధించిన పుస్తకాన్ని చదువుతూ ఓ ఫొటో షేర్ చేసింది. ఇండియన్ 2 కోసమే కాజల్ అది చదువుతుందని ఇప్పటివరకు మార్షల్ ఆర్ట్స్ గురించి పెద్దగా అవసరం పడని కాజల్ ఈసారి ఈ సినిమా కోసం చాలా కష్టానే్న ఎదుర్కోబోతున్నట్లుగా చెబుతున్నారు. కమల్‌హాసన్, శంకర్‌ల కాంబినేషన్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందబోతున్న ‘ఇండియన్ 2’ మూవీ వచ్చేనెలలో చిత్రీక‌ర‌ణకు నోచుకోనున్న‌ద‌ని తెలుస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa