ట్రెండింగ్
Epaper    English    தமிழ்

క్రిస్మ‌స్ ప్రార్థ‌న‌ల్లో ‘ఆనంద్‌’ రాజా

cinema |  Suryaa Desk  | Published : Sun, Dec 23, 2018, 03:10 PM

హీరో రాజా పేరు విన‌గానే అందరికీ ‘ఆనంద్‌’ చిత్రం గుర్తుకొస్తుంది. మంచి కాఫీలాంటి అబ్బాయి అని ఆయన్ని అప్పట్లో అందరూ పిలుచుకునేవారు. ఆయన సినిమాలకు దూరమై కొన్నేళ్లయింది. ప్రస్తుతం దైవ సేవకుడిగా ఉన్నారు. ఓ చర్చిని నిర్వహిస్తున్నారు. క్రిస్మ‌స్ సంద‌ర్భంగా ప్రార్థనలు చేస్తుంటామ‌న్నారు. దేవుడి ప్రార్థనా సమావేశాలు చాలా ముఖ్యం. ఈ నెల్లో ఆంధ్ర, తెలంగాణలో ఎన్నో సమావేశాలకు వెళ్లాను. ఎందరితోనో కలిసి ప్రార్థనలు చేశాం. క్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన గురించి ప్రచారం చేశాం. క్రీస్తు ఈ లోకానికి రావాల్సిన కారణం ఏంటి? ఆయన కృప ఎలాంటిది? వంటి విషయాలు స్మరించుకుంటూ క్రిస్మస్‌ను అందరితో సెలబ్రేట్‌ చేసుకుంటున్నామ‌ని ఆ ఆనందం మరెందులోనూ ఉండదని హీరో రాజా తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa