ప్రభాస్ ఫ్యాన్స్ తమ అభిమాన హీరో బర్త్ డే హ్యాంగ్ ఓవర్లో ఉన్నారు. నెల రోజులు ముందు నుంచే దీని కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి.సోషల్ మీడియాలో సందడి నెలకొంది.అక్టోబర్ 23న ప్రభాస్ 43వ ఏట అడుగుపెట్టబోతున్నారు. ఫ్యాన్స్ ఒక ప్రక్క వేడుకలకు సిద్ధం అవుతుండగా ఒక బ్యాడ్ న్యూస్ అందుతుంది. ఆయనకు బర్త్ డే వేడుకలు జరుపుకునే మూడ్ లేదట. పెదనాన్న కృష్ణంరాజు మరణమే దీనికి కారణం. ఇంకా ఆ బాధ నుండి కోలుకోని ప్రభాస్ బర్త్ డే జరుపుకోకూడని నిర్ణయించుకున్నాడట. ఈ క్రమంలో ఆయన వేడుకలకు దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యారట. అదే సమయంలో అభిమానులను కలవాలని ఆయన కోరుకోవడం లేదట.సెప్టెంబర్ 11న కృష్ణంరాజు అనారోగ్యంతో కన్నుమూశారు. పెదనాన్న మరణం ప్రభాస్ ని తీవ్ర ఆవేదనకు గురి చేసింది. కృష్ణంరాజు మరణానంతర కార్యక్రమాలు ప్రభాస్ శ్రద్దగా పూర్తి చేశారు. దీని కోసం ఆయన షూటింగ్స్ పక్కన పెట్టారు. తమ సొంత ఊరు మొగల్తూరులో సంస్మరణ సభ భారీగా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు. లక్షల్లో అభిమానులు మొగల్తూరు చేరుకున్నారు. వారి కోసం దాదాపు రూ. 3 కోట్లు ఖర్చుపెట్టి 50 రకాల వంటకాలతో విందు ఏర్పాటు చేశారు ప్రభాస్.
ఇక ప్రభాస్ బర్త్ డే వేడుకలకు దూరంగా ఉండనున్నారన్న వార్త ఫ్యాన్స్ ని తీవ్ర నిరాశకు గురి చేస్తుంది. అయితే ఫ్యాన్స్ తమ వేడుకలు జరుపుకోవచ్చు. దానికి ఎలాంటి అడ్డంకి ఆయన చెప్పలేదు. తమ తమ ఊళ్లలో ప్రభాస్ బర్త్ డే వేడుకలు చేసుకోవడానికి ఎలాంటి అభ్యంతరం వ్యక్తపరచలేదు. ఇక బిల్లా, రెబల్ చిత్రాల స్పెషల్ షోస్ వరల్డ్ వైడ్ ప్రదర్శించనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో రికార్డు థియేటర్స్ లో బిల్లా విడుదల చేస్తున్నారు. ఫ్యాన్స్ కోసం 4కే వర్షన్ అందుబాటులోకి తెచ్చారు.