బాలీవుడ్ సీనియర్ హీరో అక్షయ్ కుమార్ నటించిన కొత్త చిత్రం "రామ్ సేతు". టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేవ్ ఈ సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నారు. గ్లామరస్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్ గా నటిస్తుంది. నుష్రత్ బరుచ కీలకపాత్రలో నటిస్తుంది. అభిషేక్ శర్మ ఈ సినిమాకు డైరెక్టర్ కాగా, అరుణ భాటియా, విక్రమ్ మల్హోత్రా, సుభాస్కరన్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
అశోకవనంలో ఉన్న సీత జాడ కనుగొనేందుకు శ్రీరాముడు ఏర్పాటు చేసిన బ్రిడ్జి (వంతెన) గా అభివర్ణింపబడే కొన్ని వందల ఏళ్ళ క్రితంనాటి రామ్ సేతు కట్టడం అసలు నిజంగా ఉందా లేదా అని ఆర్కియోలజిస్ట్ పాత్ర పోషిస్తున్న అక్షయ్ కుమార్ అండ్ టీం చేసే యాక్షన్ అడ్వెంచరస్ ఈ సినిమా. పోతే, ఈ చిత్రం రేపే థియటర్లలో హిందీ, తెలుగు, తమిళ భాషలలో విడుదల కావడానికి రెడీగా ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa