నందమూరి కళ్యాణ్ రామ్ రీసెంట్ బ్లాక్ బస్టర్ హిట్ "బింబిసార" థియేటర్లలో మెరుపులు మెరిపించి తదుపరి రీసెంట్గానే డిజిటల్ ఎంట్రీ ఇచ్చింది. ఓటిటిలో కూడా బింబిసారుడి రికార్డులకు కొదువ లేకుండా పోతుంది. శుక్రవారం నుండి జీ 5 ఓటిటిలోకి తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో స్ట్రీమింగ్ కొచ్చిన బింబిసార తాజాగా 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ ని పూర్తి చేసుకున్నట్టు సదరు ఓటిటి సంస్థ అధికారిక ప్రకటన చేసింది.
కొత్త దర్శకుడు వసిష్ఠ తెరకెక్కించిన ఈ సోసియో ఫాంటసీ యాక్షన్ డ్రామాలో క్యాథెరిన్ ట్రెసా, సంయుక్తా మీనన్ హీరోయిన్లుగా నటించారు. శ్రీనివాసరెడ్డి, వైవా హర్ష, ప్రకాష్ రాజ్ కీలకపాత్రల్లో నటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa