యశోద ట్రైలర్ లాంచ్ ను మేకర్స్ గ్రాండ్ మ్యానర్ లో ప్లాన్ చేస్తున్నారు. పాన్ ఇండియా భాషల్లో విడుదల కాబోతున్న ఈ ట్రైలర్ ను రెస్పెక్టీవ్ స్టార్లు విడుదల చేస్తున్నట్టు ప్రకటిస్తున్నారు. కన్నడలో రక్షిత్ శెట్టి, మలయాళంలో దుల్కర్ సల్మాన్, తమిళంలో హీరో సూర్య యశోద ట్రైలర్ ను డిజిటల్ లాంచ్ చెయ్యబోతున్నట్టు ప్రకటించిన మేకర్స్ తాజాగా యశోద హిందీ ట్రైలర్ ను స్టార్ హీరో వరుణ్ ధావన్ రిలీజ్ చెయ్యబోతున్నారని తాజా ప్రకటన చేసారు.
వరుణ్ ధావన్, సమంత కలిసి త్వరలోనే "సిటాడెల్" అనే పాన్ ఇండియా వెబ్ సిరీస్ లో నటించబోతున్నారు. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి.
హరి శంకర్, హరీష్ నారాయణ్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ సమంత నుండి రాబోతున్న తొలి పాన్ ఇండియా ప్రాజెక్టు. నవంబర్ 11వ తేదీన ఈ చిత్రం థియేటర్లలో విడుదల కాబోతుంది.