ఎక్కడ విన్నా కాంతార పేరే వినిపిస్తుంది. ఈ కన్నడ సినిమా అన్ని భాషల ప్రేక్షకులను విశేషంగా అలరిస్తుంది. కాంతార క్రెడిట్ పూర్తిగా ఆ మూవీ కథ, డైరెక్టర్ టేకింగ్ కే చెందుతుంది.
కర్ణాటక లో ఒక ప్రాంతీయ ప్రజలు పాటించే ఆచార వ్యవహారాలను ఎవరూ నొచ్చుకోకుండా, ఎలాంటి నెగిటివిటీకి తావు లేకుండా డైరెక్ట్ చేసిన రిషబ్ శెట్టికి ప్రేక్షకుల నుండి, సినీ విమర్శకుల నుండి విశేషంగా ప్రశంసలు వస్తున్నాయి. అలానే పలువురు సినీ సెలెబ్రిటీలు కూడా కాంతారను చూసి, మెచ్చుకుంటూ సోషల్ మీడియాలో ట్వీట్లు పెడుతున్నారు.
తాజాగా కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ కాంతార సినిమాను చూసి, తన అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. 'మనకు తెలిసినదానితో పోలిస్తే తెలియనిది చాలా ఎక్కువ' అనే విషయాన్ని సినీ ప్రపంచంలో హోంబలే ఫిలిమ్స్ చాలా బెటర్ వర్షన్ లో చెప్పింది. కాంతార మూవీ నాకు గూజ్ బంప్స్ వచ్చేలా చేసింది. రిషబ్ శెట్టి... రైటర్, డైరెక్టర్, యాక్టర్ గా నీకు నా హ్యాట్సాఫ్. ఇండియన్ సినిమాలో మాస్టర్ పీస్ లా నిలిచిపోయే కాంతార చిత్రబృందానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు.... అంటూ రజినీ తన ట్వీట్ లో పేర్కొన్నారు.