ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లో ఏ చిన్న సినిమా రిలీజ్ అయినా కానీ ఇరు తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాలలో ఆయా చిత్రబృందాలు ముమ్మర ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తద్వారా తమ సినిమాను ప్రేక్షకుల్లోకి బలంగా తీసుకెళ్లవచ్చని మేకర్స్ నమ్మకం. ఈ ఫార్ములా ఇటీవల విడుదలైన కొన్ని చిత్రాలకు చాలా బాగా పని చేసింది కూడా.
తాజాగా ఈ ప్రమోషనల్ ఫార్ములాతోనే మరొక మూవీ కూడా రాబోతుంది. సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న లైక్ షేర్ సబ్స్క్రైబ్ మూవీ నవంబర్ 4న గ్రాండ్ రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్స్ ను ఫుల్ స్వింగ్ లో జరిపేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు రేపు విజయవాడలో LSS మూవీ టీం హల్చల్ చేయనుంది. రేపు ఉదయం ఎనిమిదింటికి విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ దర్శనం, పదింటికి ప్రెస్ మీట్, రెండింటికి గుంటూరులోని విజ్ఞాన్ యూనివర్సిటీ విజిట్ చెయ్యనుంది LSS చిత్రబృందం.
మేర్లపాక గాంధీ ఈ సినిమాకు డైరెక్టర్ కాగా, ప్రవీణ్ లక్కరాజు, రామ్ మిరియాల సంగీతం అందిస్తున్నారు.