నిఖిల్ సిద్దార్థ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన కొత్త చిత్రం "18 పేజెస్". ఆల్రెడీ ఈ జంట కార్తికేయ 2 చిత్రంతో , ఇటీవలే ప్రేక్షకులను పలకరించి గ్రాండ్ పాన్ ఇండియా సక్సెస్ ను తమ ఖాతాలో వేసుకున్నారు.
కార్తికేయ 2 ఘనవిజయంతో 18 పేజెస్ మూవీ పై ప్రేక్షకుల్లో చాలా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. పల్నాటి సూర్య ప్రతాప్ ఈ సినిమాకు దర్శకుడు కాగా, జీనియస్ అండ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాకు కథను అందించారు. ఈ సినిమా డిసెంబర్ 23న విడుదల కాబోతుందని జోరుగా జరిగిన ప్రచారం నిజమేనంటూ, మేకర్స్ కొంచెంసేపటి క్రితమే 18 పేజెస్ అఫీషియల్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ స్పెషల్ పోస్టర్ ను విడుదల చేసారు.
సుకుమార్ రైటింగ్స్, GA 2 పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం ఫైనల్ షూటింగ్ షెడ్యూల్ ను జరుపుకుంటుంది.