చియాన్ విక్రమ్, ఐశ్వర్యారాయ్ బచ్చన్, కార్తీ, త్రిష, జయం రవి, శరత్ కుమార్, శోభితా ధూళిపాళ్ల, ఐశ్వర్య లక్ష్మి, ప్రకాష్ రాజ్, ప్రభు, విక్రమ్ ప్రభు.. భారీ తారాగణంతో తెరకెక్కిన కోలీవుడ్ బిగ్ బడ్జెట్ మూవీ "పొన్నియిన్ సెల్వన్".
మణిరత్నం డ్రీం ప్రాజెక్ట్ గా రూపొందిన ఈ మూవీ సెప్టెంబర్ 30వ తేదీన పాన్ ఇండియా భాషల్లో విడుదలై చాలా మంచి కలెక్షన్లను రాబడుతోంది. ముఖ్యంగా ఓవర్సీస్ లో పొన్నియిన్ సెల్వన్ విజృంభిస్తుంది.
తాజాగా ఈ మూవీ డిజిటల్ ఎంట్రీపై ఇంటరెస్టింగ్ బజ్ ఒకటి వినిపిస్తుంది. వచ్చే నెల 18 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో పొన్నియిన్ సెల్వన్ స్ట్రీమింగ్ కావడానికి రెడీ అవుతున్నట్టు టాక్. త్వరలోనే ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడనుందట.